Thursday, 05 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా కొమురం భీమ్ 125వ జయంతి వేడుకలు

⏩ జీవో నెంబర్ 3 కి రాజ్యాంగబద్ధమైన ప్రత్యామ్నాయం: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల ఉద్యోగ భద్రత కోసం జీవో నంబర్ 3 స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ డిమాండ్.

ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా కొమురం భీమ్ 125వ జయంతి వేడుకలు
Share Short Clip Download PDF

⏩గిరిజనుల హక్కులకు ప్రాధాన్యత: బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన గిరిజన రక్షణ చట్టాలను పక్కాగా అమలు చేయాలని టిడిపి నేతల పిలుపు

⏩గిరిజన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్న టిడిపి నాయకులు

జల్-జంగల్-జమీన్' పోరాట స్ఫూర్తి: ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల కోసం నిజాం పాలనపై సమరం సాగించిన వీరుడు కొమురం భీమ్

హైదరాబాద్(రైట్స్ మీడియా): ఎన్‌టిఆర్ భవన్‌లో కొమురం భీమ్ 125వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురువారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రాజునాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ...

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... కొమురం భీమ్ ‘జల్-జంగల్-జమీన’ అనే నినాదంతో మానవ హక్కుల కోసం ఆనాడే పోరాడారు. కొమురం భీమ్ తన 15వ యేట నుంచి అన్యాయాన్ని ఎదిరించే తత్వాన్ని, హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించారు. ఎన్‌టిఆర్ స్వయంగా తండాలకు వెళ్లి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. గిరిజన ప్రాంతాలలో ఎన్‌టిఆర్ హయాంలో రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు గిరిజనుల విద్యకు ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించారు. ఎన్‌టిఆర్ హయాంలో జీవో నెంబరు 275 ప్రకారం 7వ తరగతి ఫెయిల్ అయిన వారిని ఆదివాసీ ప్రాంతాలలో టీచర్ ఉద్యోగాలను ఆదివాసీల ట్రైబ్స్‌కు ఇచ్చేవారు. తరువాత ఈ జీవోను 1793 గా మార్చి 10వ తరగతి ఫెయిల్ అయిన వారికి ఆదివాసీ ప్రాంతాలలో టీచర్ ఉద్యోగాలను ఆదివాసీలకు ఇచ్చేవారు. తదనంతరం చంద్రబాబు గారి హయాంలో జీవో నెంబరు 3 ని తీసుకొచ్చి అన్‌ట్రైన్డ్ టీచర్స్‌ను ఉద్యోగాలలోకి తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేవారు. 109 డిపార్ట్‌మెంట్‌లలో జీవో నెంబరు 3 ప్రకారం ఆదివాసీ గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాలు ఇచ్చేవారు. ఈ జీవోను 2021 లో అప్పటి ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించకపోవడంతో కోర్టు కొట్టివేయడం జరిగింది. జీవో నెంబరు 3 కి ప్రత్యామ్నాయంగా రాజ్యాంగానికి లోబడి ఆదివాసీ గిరిజనులకు జీవోను తీసుకురావాల్సిన అవసరముంది. తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాలలో ఇక ముందు గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తుంది.

జాతీయ పార్టీ అధికార ప్రతినిధి, తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ...

‘జల్-జంగల్-జమీన’ అనే నినాదాన్ని కొమురం భీమ్ అధికారం కోసం చేయలేదు. ఆదివాసీల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం ఇది. ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకుని ఎన్‌టిఆర్ గిరిజన సంక్షేమ నిధిని పెంచారు. చంద్రబాబు గారు ప్రత్యేకంగా గిరిజనుల విద్య కొరకు ప్రత్యేక పాఠశాలలను, హాస్టళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత తండాలను గ్రామ పంచాయితీలుగా చేస్తామని చెప్పి పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ గిరిజనులకు వారు ఏమి చేశారో సమాధానం చెప్పలేని పరిస్థతి. విద్య, వైద్యం, ఉపాధి, భూమి అనే నాలుగింటిని గిరిజనులకు కల్పించిననాడే వారికి న్యాయం జరుగుతుంది.

రాష్ట్ర పార్టీ మాజీ అధికార ప్రతినిధి, అజ్మీరా రాజునాయక్ మాట్లాడుతూ...

హక్కుల కోసం నిజాం పాలకులతో కొట్లాడిన యోధుడు కొమురం భీమ్. ఈ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు చేసింది.తెలుగుదేశం పార్టీ ఎస్సీ,ఎస్టీల కొరకు మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ కమిటీలలో పది శాతం గిరిజనులకు ఇచ్చి ప్రోత్సహించాలని కోరుచున్నాం.

గిరిజనుల నాయకుడు ఆరెం రామయ్య మాట్లాడుతూ...

తెలంగాణ తల్లి కన్న గొప్ప పోరాట యోధుడు కొమురం భీమ్. ‘జల్-జంగల్-జమీన’ అనే మÖడు పదాల వెనుక ఒక జాతి మొత్తం హక్కుల కోసం ఒక వీరుడి పోరాటం కనబడుతుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు ఈ పోరాటాలన్నింటినీ గుర్తించి రాజ్యాంగంలో ఆదివాసీ గిరిజనులకు రక్షణ చట్టాలను పొందుపరిచారు. ఈ చట్టాలు నేడు సరిగా అమలు జరగడం లేదు.

ఖమ్మం పార్లమెంట్ పార్టీ అడ్‌హాక్ కమిటీ సభ్యులు, కాట్రం స్వామి దొర మాట్లాడుతూ...

గిరిజనుల హక్కుల కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు కొమురం భీమ్. కొమురం భీమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అర్పించే నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు సూర్యదేవర లత, కాణిపాకం దేవస్థానం పాలకమండలి సభ్యులు శ్రీపతి సతీష్, అనంత రెడ్డి, సంధ్యపోగు రాజశేఖర్, గూడెపు రాఘవులు, యం.స్వాతి చౌదరి లు పాల్గొని ప్రసంగించారు. ఎబిఆర్ మోహన్‌రావు, బాలాజీ గోస్వామి, యాదగిరి, జలమోని రవీందర్, నర్సింహ, మండవ వెంకటేష్‌గౌడ్, పబ్బతి శేఖర్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.
-తెలుగుదేశం ప్రకాశ్ రెడ్డి.