Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేయాలి

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేయాలి
Share Short Clip Download PDF

గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే నాయిని…

హనుమకొండ, అక్టోబర్ 22(రైట్స్ మీడియా): రాబోయే వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించిన అధికారిక అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కట్టుబడి పనిచేయాలని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ఇప్పటికే నిర్వహించిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేయాలని సూచించారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ అధ్యక్షుడు తమ పరిధిలో ఉన్న పట్టభద్రులను గుర్తించి, ఫారమ్-18 ద్వారా ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యావంతులు, నిరుద్యోగులు, పట్టభద్రులను నేరుగా కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించడంతో పాటు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో పటిష్టమైన సమన్వయంతో పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, విద్యావంతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను పట్టభద్రుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఓటు కీలకమని, పట్టభద్రుల ఓటరు నమోదు నుంచి ఎన్నికల ప్రచారం వరకు పార్టీ శ్రేణులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ..

ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం స్ఫూర్తితో హనుమకొండ జిల్లాలోని ప్రతి డివిజన్, మండల స్థాయిలో సమన్వయంతో ఎన్నికల సన్నాహాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ తొగరు జగన్ మోహన్ రెడ్డి, కో-కన్వీనర్ బోడ దినేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అజీజ్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భట్టి శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్లు పుప్పాల ప్రభాకర్, తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ రజాలీ, తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్, వేముల శ్రీనివాస్, నెక్కొండ కిషన్, డీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ కమిటీ చైర్మన్ మార్క విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.