80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి, పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించిన వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సాయిబాబుకు ఉత్తమ పోలీస్ అధికారిగా ప్రశంసా పత్రం అందజేశారు.
జనగామ డీసీపీ పరిధిలో విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, ప్రజలకు అందించిన సేవలను గుర్తిస్తూ ఆయనను ఉత్తమ అధికారిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా ఎస్‌ఐ సాయిబాబు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఎస్‌ఐ సాయిబాబును అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ పోలీస్ అధికారిగా ప్రశంసా పత్రం అందుకోవడం పట్ల వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ సాయిబాబుకు అభినందనలు తెలిపారు.
ఉత్తమ పోలీస్ అధికారిగా వర్ధన్నపేట ఎస్‌ఐ సాయిబాబుకు ప్రశంసా పత్రం