ఐనవోలు మండల పరిధిలోని నందనం సొసైటీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నందనం సొసైటీ చైర్మన్ మాజీ టిస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు , సీఈవో సంపత్, గ్రామ సర్పంచ్ రోజా, వార్డు నెంబర్లు, వర్ధన్నపేట సొసైటీ చైర్మన్ రాజేష్ కన్నా , నందనం సొసైటీ డైరెక్టర్లు సంపత్ రావు,బుచ్చిరెడ్డి,మెటె చిరంజీవి, రాజారపు కుమార్,బిర్రు పద్మ, కలకోటి ఎలేంద్ర, చింతబాబు తదితరులు పాల్గొన్నారు.