విధి నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని ఈస్ట్ జోన్ పరిధిలోని పర్వతగిరి సీఐ రాజగోపాల్ గౌడ్ పోలీస్ సేవా పతకాన్ని అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ స్వేత, చేతుల మీదుగా ఆయన ఈ పతకాన్ని స్వీకరించారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణ పట్ల అంకితభావం, ప్రజాసేవలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ సేవా పతకం లభించింది. పతకం అందుకోవడం పట్ల సీఐ రాజగోపాల్ గౌడ్ ఆనందం వ్యక్తం చేస్తూ, తన సేవలను గుర్తించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
విధి నిర్వహణలో విశేష సేవలకు సీఐ బూర రాజగోపాల్ గౌడ్ కు పోలీస్ సేవా పతకం