Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

స్వామివారి ఆశీస్సులతో రోగులు, గర్భిణులు ఆయురారోగ్యాలతో వెళ్లాలి..

⏩బండారి గ్రూప్స్ విజయలక్ష్మి హాస్పిటల్ యాజమాన్యం.

స్వామివారి ఆశీస్సులతో రోగులు, గర్భిణులు ఆయురారోగ్యాలతో వెళ్లాలి..
Share Short Clip Download PDF

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని ఖలీల్​వాడీలోని బండారి గ్రూప్స్ విజయలక్ష్మి హాస్పిటల్ లో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వినాయక శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి సుజాత, గాంధీ హాస్పిటల్ వైస్ ప్రిన్సిపాల్ నాగమోహన్ దంపతులు కలిసి ఆది వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,

ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా వినాయకుడికి పూజా కార్యక్రమం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తమ ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు గర్భిణీ స్త్రీలు, ప్రసుతి నిమిత్తం వచ్చే వారు ఆ మహా వినాయకుని ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో సంతోషంగా వెళ్లాలని ప్రతి ఏడాది ఈ వినాయక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరిపై విజ్ఞాలను తొలగించే ఆ విఘ్నరాజు ఆశీస్సులు ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బండారి భోజన్న, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Source / reference: Senior Journalist Nakka Rakesh, Nizamabad.