Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

రాష్ట్ర రాజధాని తర్వాత నిజామాబాద్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర: ఎమ్మెల్యే ధన్ పాల్

రాష్ట్ర రాజధాని తర్వాత నిజామాబాద్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర: ఎమ్మెల్యే ధన్ పాల్
Share Short Clip Download PDF

నిజామాబాద్(రైట్స్ మీడియా): నిజామాబాద్ జిల్లా రాష్ట్ర రాజధాని తర్వాత నిజామాబాద్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతుందని, ఎంతో ఘన చరిత్ర ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ చౌరస్తాలో శుక్రవారం వినాయక నిమజ్జన శోభాయాత్ర రథయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, భక్తులతో ప్రజలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

స్వాతంత్య్ర ఉద్యమంలో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుమేరకు నిజామాబాద్ వినాయకుడి రథయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. 21 జతల ఎడ్లతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నగరంలోని ప్రధాన వీధుల మీదుగా ముందుకు సాగుతుందన్నారు. యువత భక్తమార్గంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారనన్నారు. ఇందుకు యువతే నిదర్శనమన్నారు. వందేళ్లుగా రథం శోభయాత్ర సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. ప్రధానంగా నగరంలోని పలు కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు శోభాయాత్ర ఆధ్యాంతం సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.