నిజామాబాద్ నగరంలో వినాయక్ బావి వద్ద మరియు దుబ్బ ప్రాంతం నుంచి ప్రారంభం కానున్న సార్వజనిక్ గణేష్ శోభాయాత్ర సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య క్షుణ్ణంగా పర్యవేక్షించారు.
శోభాయాత్ర సాగే మార్గంలో పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ సిబ్బంది మోహరింపు తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు.
సార్వజనిక్ గణేష్ శోభాయాత్ర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
శోభయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే శోభయాత్రలో పాల్గొనే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో సజావుగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టిందని పోలీస్ కమిషనర్ తెలిపారు.