మహబూబాబాద్, నవంబర్ 5(రైట్స్ మీడియా): నేటి బాలలే రేపటి పౌరులని ఆ క్రమంలో బాల్ దివస్ తో భవిష్యత్తు భారతావనికి పునాది రాళ్లను వేయవచ్చునని అదనపు కలెక్టర్ మరియు ఇంచార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి కె.అనిల్ కుమార్ అన్నారు.
కేంద్రప్రభుత్వ బాలవికాస్ అభియాన్ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తారీకు నుండి 14 వ తారీకు వరకు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించే బాల్ దివస్ పక్షోత్సవాల కార్యక్రమాన్ని సంబంధిత పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించి గురువారం కలెక్టరేట్ అదనపు కలెక్టర్ రెవెన్యూ చాంబర్ లో ప్రారంభించారు.