Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సమష్టిగా కృషి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

నవంబర్ 6 లోపు అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సమష్టిగా కృషి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
Share Short Clip Download PDF

నవంబర్ 6 లోపు అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలి

హైదరాబాద్ (రైట్స్ మీడియా): హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిధిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీకి ఎంతో రాజకీయ ప్రాధాన్యత కలిగినవని తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్ పరిధిలో జరిగే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకుల సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిపారు. అభ్యర్థి విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

నవంబర్ 6వ తేదీలోపు అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించే ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పండుగలు ముగిసిన నేపథ్యంలో మరుసటి రోజు నుంచే పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో బూత్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు తదితర అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సమష్టిగా కృషి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించి, పీసీసీ నాయకులతో కలిసి రోజువారీగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా తాను, మంత్రి అజారుద్దీన్ తదితర నాయకులు క్షేత్రస్థాయి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వివిధ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విజయాలను పట్టభద్రులకు వివరించడంతో పాటు, వారి సమస్యలను తెలుసుకుని పార్టీకి మద్దతు కూడగట్టాలని నాయకులకు సూచించారు.

హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రాబోయే నాలుగైదు రోజుల పాటు జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర నియోజకవర్గాల్లో పార్టీ నాయకులతో కలిసి పర్యటించి, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సమష్టిగా కృషి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, పీసీసీ కోఆర్డినేటర్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సమష్టిగా కృషి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్