Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

భూదాన్ భూముల వివరాలని త్వరగా అప్ డేట్ చేయాలి

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి

భూదాన్ భూముల  వివరాలని త్వరగా  అప్ డేట్ చేయాలి
Share Short Clip Download PDF

జీవో 59, అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్రమబద్ధీకరణల పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పూర్తి చేయాలి

హనుమకొండ (రైట్స్ మీడియా): హనుమకొండ జిల్లా కలెక్షరేట్ లో రెవెన్యూ సంబంధిత అంశాలు, భూ రీసర్వే పై ఆర్డీవోలు, భూములు కొలతలు శాఖ అధికారులు, తహసీల్దార్లతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం*

భూదాన్ భూముల వివరాలను భూభారతి పోర్టల్ లో (అప్డేట్) నవీకరణను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి తహసీల్దార్లను ఆదేశించారు.

గురువారం హనుమకొండ జిల్లా కలెక్షరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రెవెన్యూ సంబంధిత అంశాలు, భూ రీసర్వే పై ఆర్డీవోలు, భూములు కొలతలు శాఖ అధికారులు, తహసీల్దార్లతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ

జిల్లాలో జీవో 59, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణల పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. భూములకు సంబంధించి పెండింగ్ కోర్టు కేసులను త్వరగా పూర్తి చేయాలి అన్నారు. పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తుల త్వరితగతిన పరిష్కారానికి తహసిల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను తహసిల్దార్లు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు.

ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, భూములు కొలతలు శాఖ ఏడి నూర్ సింగ్, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.