నూతనంగా ప్రారంభమైన మణికంఠ సర్వీస్ ఫిల్లింగ్ స్టేషన్ సంస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధి చెందాలని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ఆకాంక్షించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డి.సి. తండాలో తుమ్మల యాకయ్యకు చెందిన మణికంఠ సర్వీస్ ఫిల్లింగ్ స్టేషన్ (హిందూస్తాన్ పెట్రోలియం) ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరిమిల సంపత్ రావు, జూలూరి శ్రీనివాస్, గుమ్మడి హరిబాబు, బక్కతట్ల రాజు, నందిపాక భాస్కర్, రాజు, వర్ధన్నపేట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధి చెందాలి
కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం..మణికంఠ సర్వీస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభం