వర్ధన్నపేట మండల పరిధిలోని చంద్రు తండా గ్రామంలో గురువారం రోజున పొలంబడి (క్షేత్రస్థాయి శిక్షణ) కార్యక్రమం నిర్వహించారు.
వర్ధన్నపేట మండల వ్యవసాయాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వరి, పత్తి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత వానాకాలం సీజన్ లో వరి, పత్తి పంటల్లో వచ్చే చీడపీడల గురించి రైతులకు వివరించారు. పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు వేప నూనె, లింగాకర్షక బుట్టలు వాడాలని సూచించారు. వరిలో కలుపు నివారణ, యూరియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.రైతులు అధిక దిగుబడి కోసం ఇష్టానుసారంగా రసాయన మందులు వాడకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, పంటల బీమా పథకాల గురించి వివరించారు.రైతులు తమ పంటల్లో వస్తున్న సమస్యలను వ్యవసాయ అధికారి కి తెలియజేయగా, వాటికి పరిష్కార మార్గాలు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) శిరీష , గ్రామ సర్పంచ్, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చంద్రు తండాలో పొలంబడి కార్యక్రమం
రైతులకు సాగు మెళకువలపై అవగాహన కల్పించిన వ్యవసాయాధికారి విజయ్ కుమార్