Saturday, 19 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

నాణ్యతా ప్రమాణాలతో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం పూర్తి చేయాలి.

హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి.

నాణ్యతా ప్రమాణాలతో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం పూర్తి చేయాలి.
Share Short Clip Download PDF

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తి పరిధి దత్తాత్రేయ కాలనీలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన కలెక్టర్.

నాణ్యతా ప్రమాణాలతో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామ పరిధిలోని దత్తాత్రేయ కాలనీలో నిర్మిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణాన్ని ఎన్ని రోజుల్లోగా పూర్తి చేయగలరనే విషయంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ లైన్ల పనుల పురోగతిపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ..

వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన ఈ నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పనుల వేగవంతానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వాటర్‌ ట్యాంక్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్‌ లైన్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పనుల్లో ఉపయోగిస్తున్న నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాళ్లపెల్లి కుమారస్వామి, మిషన్ భగీరథ ఇంట్రా డివిజన్ ఈఈ బి. గాయత్రీ, గ్రిడ్ ఈఈ రామాంజనేయులు, డీఈలు శ్రీనివాస్, జట్టి శ్రీనివాస్, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో సుమనవాణి, ఏఈలు అనిల్, నీరజ, పంచాయతీ కార్యదర్శి హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.