హనుమకొండ, అక్టోబర్ 24(రైట్స్ మీడియా):
శనివారం భువనేశ్వర్‌లో నిర్వహించిన 'అర్బన్ కాన్‌క్లేవ్'లో వరంగల్ నగరానికి అవార్డు లభించింది. ఈ అవార్డును హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి లాంఛనంగా అందుకున్నారు.
భువనేశ్వర్ అర్బన్ కాన్‌క్లేవ్‌లో వరంగల్ నగరానికి అవార్డు
అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
• ప్యానెల్ చర్చల్లో పాల్గొన్న అధికారుల బృందం..
భువనేశ్వర్ అర్బన్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కూడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, కుడా పి ఓ అజిత్ రెడ్డి.
ఈ ప్రతిష్టాత్మక కాన్‌క్లేవ్‌లో కలెక్టర్‌తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, కుడా పీవో అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరాల అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర కీలక అంశాలపై నిర్వహించిన వివిధ ప్యానెల్ చర్చల్లో అధికారుల బృందం పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
జిల్లాకు మరియు వరంగల్ నగరానికి లభించిన ఈ విశేష గుర్తింపు, నగర అభివృద్ధి దిశగా చేపడుతున్న కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని అధికారులు పేర్కొన్నారు.