గ్రేటర్ వరంగల్ నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) కి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్ లో యూజీడీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిపై రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీలు), సీవరేజ్ పంపింగ్ స్టేషన్లు, లిఫ్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ అంశాలను కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో మొత్తం 23 ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూములకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిపై అధికారులను కలెక్టర్ అడిగి వివరాలు తెలుసుకున్నారు.