ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబందించిన
పెండింగ్ లో ఉన్న భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలనీ కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. గురువారం కుడా కార్యాలయం లో ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబందించిన భూ సేకరణ పురోగతి పైన వారు సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణ, ఇంకా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పరిహారం తదితర విషయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ కీలకమైనందున, ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. భూయజమానులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. భూసేకరణ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు.
ఈ సమావేశంలో కూడా పిఓ అజిత్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ వి రాధా బాయి, ఈఈ భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు