Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

కేయూ పార్ట్‌టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

⏩కేయూపీఎల్‌ఏ (KUPLA) అధ్యక్షుడిగా డాక్టర్ కె. రాజేందర్ ఎన్నిక.

కేయూ పార్ట్‌టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
Share Short Clip Download PDF

⏩ప్రశాంత వాతావరణంలో ముగిసిన కాకతీయ యూనివర్సిటీ పార్ట్‌టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఎన్నికలు.

⏩నూతన కార్యవర్గాన్ని అభినందించిన కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. మనోహర్.

హన్మకొండ(రైట్స్ మీడియా): కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లో శుక్రవారం పార్ట్‌టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ (KUPLA – Kakatiya University Part-Time Lecturers Association) ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి.

ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డాక్టర్ కె. రాజేందర్ మరియు డాక్టర్ కె. సుబాష్ పోటీ పడ్డారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని మొత్తం 145 మంది ఓటర్లకు గాను 84 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపులో డాక్టర్ కె. రాజేందర్ 64 ఓట్లు సాధించి ప్రత్యర్థి డాక్టర్ కె. సుబాష్‌పై (20 ఓట్లు) ఘన విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలను ప్రెసైడింగ్ అధికారి డాక్టర్ ఆదిరెడ్డి అధికారికంగా ప్రకటించారు.

కేయూపీఎల్‌ఏ (KUPLA) నూతన కార్యవర్గం:

➤అధ్యక్షుడు: డాక్టర్ కె. రాజేందర్
➤ప్రధాన కార్యదర్శి: డాక్టర్ నాగేశ్వర్ రావు
➤వర్కింగ్ ప్రెసిడెంట్: డాక్టర్ వాణీ దేవి
➤కోశాధికారి: డాక్టర్ టి. మౌనిక
➤ఆర్గనైజింగ్ సెక్రటరీ: డాక్టర్ పి. మహేందర్
➤ఉమెన్ కన్వీనర్: డాక్టర్ భాగ్యమ్మ

నూతన కార్యవర్గానికి అభినందనల వెల్లువ:

ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం నూతనంగా ఎన్నికైన కేయూపీఎల్‌ఏ కార్యవర్గ సభ్యులు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. మనోహర్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి వారు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.

ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పార్ట్‌టైమ్ అధ్యాపకులకు, ఎన్నికల అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు మరియు సహాయ నిర్వహణ కమిటీ సభ్యులకు నూతన అధ్యక్షులు డాక్టర్ కె. రాజేందర్, కార్యవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.