పోరాటాల పురిటి గడ్డ, ఉద్యమాలకు ఊపిరి పోసిన ఓరుగల్లు గడ్డమీద జన్మించిన వీరనారి
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హసన్పర్తి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ ఫోటోకు హసన్పర్తి బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు పూలమాలవేసి, నివాళులర్పించడం జరిగింది.
చాకలి ఐలమ్మ పోరాటపటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకం
హసన్పర్తి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బండి రజనీకుమార్.
ఈ సందర్భంగా హసన్పర్తి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బండి రజనీకుమార్ మాట్లాడుతూ
చాకలి ఐలమ్మ పోరాటం యువతకు స్ఫూర్తి. ఆనాడు విసనురు రామచంద్రారెడ్డి దొరను ఎదిరించి, పోరాడి నిలబడి గెలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో రజాకార్లను ఎదిరించి నిలబడ్డటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ ఈనాటి తరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హసన్పర్తి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బండి రజనీకుమార్, మాజీ జెడ్పిటిసి కొత్తకొండ సుభాష్ గౌడ్, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నరేష్ రాజు, రాజేందర్, బిక్షపతి, కలువ చర్ల సుదర్శన్, సంపత్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.