ఆర్టీఐ అమలులో విధానపరమైన ఏకరూపత సాధించి, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఆస్కిలో ఎన్ఎఫ్ఐసీఐ, తెలంగాణ సమాచార కమిషన్ నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ సమాచారం ప్రజల ఆస్తి అని, దాన్ని సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిష్కార సంఖ్య కాదు, పాలనలో పెరిగిన పారదర్శకతే విజయానికి కొలమానమని అన్నారు. సెక్షన్-4 కింద స్వచ్ఛంద సమాచార వెల్లడికి ప్రాధాన్యం ఇవ్వాలని, గ్రామీణులు, మహిళలు, దివ్యాంగులకు ఆర్టీఐ సులభంగా అందుబాటులో ఉండాలని సూచించారు.