ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న ‘వారణాసి–వాద్నగర్ సేవా యాత్ర’ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు.