ప్రాథమిక పాఠశాల కంబాలపల్లి లో ఈరోజు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సమక్షంలో పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంచార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి మందుల శ్రీరాములు మాట్లాడుతూ ఉపాధ్యాయులను విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సన్మానించడం ఉపాధ్యాయులకు గొప్ప వరమని ఇలాంటి అవకాశం కొందరికే దక్కుతుందని, ఆ అవకాశం వీరికి దక్కడం గొప్ప అదృష్టంగా భావించాలని అన్నారు. గ్రామంలో విద్యార్థిని విద్యార్థులకు చక్కని విద్యాభ్యాసాన్ని మరియు విద్యార్థులను సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తు వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులే ముందుకు వచ్చి ఉపాధ్యాయులను సన్మానించడం జరిగిందని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేస్తున్నారని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ సూచనల మేరకు విద్యాశాఖ బలోపేతం చేస్తూ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు అన్ని విద్యాసంస్థలలో ఇంగ్లీష్ ప్రావీణ్యత, ప్రతి సబ్జెక్టుపై పట్టు వచ్చే విధంగా ప్రత్యేక తరగతులు, నిర్వహిస్తూ, పక్క డైట్ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని, అత్యుత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని, నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య బోధనలు సాగుతున్నాయని, కావున జిల్లా ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉన్నత భవిష్యత్తు కోసం ముందుకు రావాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసరావు, జెడి అనసూయ, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, హార్టికల్చర్ అధికారి మరియన్న, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి గిరిజ, తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు కొలిశెట్టి సత్యనారాయణ, కంబాలపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉప్పలయ్య, సన్మాన గ్రహీతలు ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ఉపాధ్యాయులు ఆవునూరి రవి, ఆర్ రాధిక, సిహెచ్ శ్రీజ, కవిత, మమత మరియు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అచ్చ ప్రశాంత్, సందు సురేష్, కారింగుల రాజశేఖర్, లావణ్య , అబ్దుల్ హైమద్, పెద్ద మాముల నాగరాజు, విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.