హనుమకొండ నయీమ్ నగర్ లోని పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ కేంద్రంలో నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలోని ఓటర్ల నుండి స్వీకరిస్తున్న ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్- 2026 )లో భాగంగా నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్ల నుండి స్వీకరిస్తున్న ధ్రువ పత్రాల విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.

శుక్రవారం హనుమకొండ నయీమ్ నగర్ లోని 240వ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ కేంద్రంలో నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలోని ఓటర్ల నుండి స్వీకరిస్తున్న ప్రక్రియను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలోని ఓటర్ల నుండి స్వీకరించిన ధ్రువపత్రాలను త్వరగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సమర్పించిన ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అనేది క్షుణ్ణంగా విచారణ అధికారులు పరిశీలించాలన్నారు. జాబితాలో ఉండి నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత సమయం, పోలింగ్ కేంద్రం, ఎన్నికల సంఘం సూచించిన ధ్రువ పత్రాలతో హాజరయ్యే విధంగా బిఎల్వోలు, ఇతర అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఏఈఆర్వో చల్లా ప్రసాద్, బీఎల్వో సూపర్ వైజర్లు, బీఎల్వోలు, తదితరులు పాల్గొన్నారు.