Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

⏩రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
Share Short Clip Download PDF

⏩216 మంది లబ్ధిదారులకు రూ. 1,02,51,000 విలువ గల సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి.

ఖమ్మం (రైట్స్ మీడియా): గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల తన నివాసంలో ఖమ్మం రూరల్, ఎదులాపురం మునిసిపాలిటీ పరిధిలోని 216 మంది లబ్ధిదారులకు ఒక కోటి 2 లక్షల 51 వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 70 మంది, ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని 95 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదల కన్నీళ్లు తుడవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నిరుపేదలకు వైద్య ఖర్చుల భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని వేగంగా అందిస్తున్నామన్నారు. అలాగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది