రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ -05(రైట్స్ మీడియా): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం,
80ఫీట్ల రోడ్డు నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయం తదితర నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సోమవారం వివరించగా, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమీక్షించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు.