Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

నరసరావుపేటలో సంచలన హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 2018 నాటి కేసులోనూ పురోగతి

⏩ఇతరుల శరీర భాగాలను కత్తిరిస్తే బలం వస్తుందనే వికృత ఆలోచనతోనే దారుణాలు.

నరసరావుపేటలో సంచలన హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 2018 నాటి కేసులోనూ పురోగతి
Share Short Clip Download PDF

⏩కేసు వివరాలు వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్.

నరసరావుపేట(రైట్స్ మీడియా): పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించిన హత్య కేసును నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయడమే కాకుండా, విచారణలో భాగంగా 2018లో జరిగిన మరొక మిస్టరీ హత్య కేసును కూడా పోలీసులు వెలికితీశారు. ఈ కేసు వివరాలను సోమవారం సాయంత్రం నరసరావుపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ వెల్లడించారు.

ఘటన వివరాలు: పోలీసుల సమాచారం ప్రకారం..

నరసరావుపేట పెద్ద చెరువు ప్రాంతానికి చెందిన గాసి రాజేష్ (35) అనే వ్యక్తి గత నెల 28వ తేదీ అర్ధరాత్రి గాంధీ పార్కు ఎదురుగా ఉన్న కాసు కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తున్నాడు. తెల్లవారుజామున నిందితుడు నిద్రిస్తున్న రాజేష్‌పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అత్యంత వికృతంగా కత్తెరతో మృతుడి ఎడమ రొమ్ము భాగాన్ని కోసి, మర్మాంగంపై ఉన్న చర్మాన్ని తొలగించాడు. ఈ దారుణంపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు (Cr.No: 152/2026 U/Sec 103(1) BNS) నమోదైంది.

పోలీసుల వేగవంతమైన దర్యాప్తు - నిందితుడి అరెస్ట్:

ఘటన తీవ్రతను దృష్ట్యా పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఆదేశాల మేరకు నరసరావుపేట డిఎస్పీ M. హనుమంతరావు పర్యవేక్షణలో, 1వ పట్టణ సీఐ SK.T. ఫిరోజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. నేర స్థలాన్ని పరిశీలించి, భౌతిక సాక్ష్యాధారాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేపట్టారు. సోమవారం (05.10.2026) మధ్యాహ్నం 1:30 గంటలకు మధ్యవర్తుల సమక్షంలో నరసరావుపేట బరంపేటకు చెందిన నిందితుడు కసుకుర్తి నిఖిల్ (30)ని పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడి నుంచి 2018 మరియు 2026 హత్య నేరాలకు ఉపయోగించిన రెండు కత్తెరలు, హత్య సమయాల్లో నిందితుడు ధరించిన రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వికృత ఆలోచనలే హత్యలకు కారణం:

విచారణలో నిందితుడు వెల్లడించిన నిజాలు విస్తుపోయేలా ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఇతరులను హత్య చేసి, వారి శరీర భాగాలను కత్తిరిస్తే తనకు అపారమైన బలం వస్తుందనే వికృత ఆలోచనలు, కలలు పదేపదే వచ్చేవి. ఆ సైకో మనస్తత్వంతోనే ఒంటరిగా నిద్రిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో 2018లో జరిగిన మరో హత్య కేసులో కూడా కీలక పురోగతి సాధించినట్లయింది.

పోలీస్ టీమ్‌కు ఎస్పీ అభినందనలు:

ఈ సంక్లిష్టమైన కేసును అత్యంత సమర్థవంతంగా ఛేదించిన నరసరావుపేట డిఎస్పీ M. హనుమంతరావు, సీఐ SK.T. ఫిరోజ్, ఎస్సై వంశీకృష్ణ మరియు ప్రత్యేక దర్యాప్తు బృంద సభ్యులను జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

నరసరావుపేట సంచలన హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 2018 నాటి కేసులోనూ పురోగతి
నరసరావుపేట సంచలన హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 2018 నాటి కేసులోనూ పురోగతి
నరసరావుపేట సంచలన హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 2018 నాటి కేసులోనూ పురోగతి

Source / reference: Journalist Sk. Gouse, Palnadu.