రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి ప్రాధాన్యమని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య తెలిపారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజున బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వం తీవ్రంగా స్పందించారు. బిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ శనివారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ లోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం అందరికీ సమానమే అని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరణ పేరిట ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించడమే కాకుండా, జాతీయ జెండా నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం చట్టరీత్యా నేరమని అన్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు తమ విధుల్లో భాగంగానే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్షసాధింపులు లేవని తెలిపారు.గతంలో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన బిఆర్ఎస్ నేతలు, నేడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రజాపాలనను, నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు.
రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యం
--వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
పోలీస్ వ్యవస్థపై అనవసర రాజకీయాలు తగవు
శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందినవారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యేపై, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను బిఆర్ఎస్ శ్రేణులు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, అయినవోలు దేవస్థానం చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, వర్దన్నపేట బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తీగల సునీత గౌడ్, అంబేద్కర్ నగర్ సర్పంచ్ చిట్టూరి రాజు, చెన్నారం మాజీ సర్పంచ్ సింధం లక్ష్మీనారాయణ,రామారం కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గజ్జెల రాంచంద్రూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.