స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలిగిందని, మైక్ లకు పర్మిషన్ లేదని తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నాయకుల పై కేసు పెట్టింది మీ పార్టీ నాయకులు కాదా? అని బీఆర్ఎస్ వర్దన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. పక్కనే భవన నిర్మాణ కార్మికులు ఆటో యూనియన్ నాయకులు కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది వారిపై లేని కేసులు కేవలం బిఆర్ఎస్ నాయకుల పైన పెట్టడంలో అంతరార్థం ఏంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేవి నీతులు చేసేవి చిల్లర రాజకీయాలు అని ఎద్దేవా చేశారు. జాతీయ జెండా పండుగ చేస్తే ట్రాఫిక్ అంతరాయం అన్నారు,అదే సెంటర్ లొ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు చేసి స్లొగన్స్ ఇచ్చుకుంటూ స్పీచ్ లు ఇస్తుంట్టే ప్రజలకు అంతరాయలు కలగవా? దానికి అనుమతులు అవసరము లేదా? వాటికి కేసులు ఉండవా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. చట్టం ముందు అందరు సమానులే అయితే మీ మీద కూడా కేసులు అవ్వాలి కదా? మీకున్న అధికారంతో అధికారులను ఒత్తిడి చేసి మాపై
కేసులు పెట్టింది ఇది నిజం కాదా? అని అన్నారు. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కుమాలిన రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పాలన చేతకాకపోతే రాజకీయాలు మానేయాలని, కక్షపూరిత రాజకీయాలు చేస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.