ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలల్లోని ఉపాధ్యాయులను శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం
వర్దన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సారంగపాణి మాట్లాడుతూ..
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి చిరస్మరణీయం అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలి. మున్సిపాలిటీ తరపున పాఠశాలల అభివృద్ధికి, మౌలిక సౌకర్యాల కల్పనకు ఎల్లప్పుడూ సహకరిస్తాం" అని అన్నారు.
అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్న పలువురిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి - రాజేందర్, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన్యోపాధ్యాయులు శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ప్రధాన్యోపాధ్యాయులు రవీందర్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ బెజ్జం పాపరావు, మాజీ వార్డు కౌన్సిలర్ పాలకుర్తి సుజాత,నాయకులు పాలకుర్తి శ్రీకాంత్, మాలోతు దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.