Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

హుజురాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఇల్లందుల శ్రీనివాస్..

నియామక పత్రం అందజేసిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్.

హుజురాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్  అధ్యక్షుడిగా ఇల్లందుల శ్రీనివాస్..
Share Short Clip Download PDF

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ హుజురాబాద్ మండల అధ్యక్షుడిగా మండలంలోని జూపాక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త ఇల్లందుల శ్రీనివాస్ నియామకమయ్యారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ శనివారం ఆయనకు నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ మాట్లాడుతూ..

క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారానికి నూతన నాయకత్వం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వర్తిస్తూ, నియోజకవర్గంలో పార్టీ విజయానికి శాయశక్తులా శ్రమిస్తానని నూతన అధ్యక్షుడు ఇల్లందుల శ్రీనివాస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్, మండల అధ్యక్షుడు కొలుగూరి కిరణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి మహేశ్, జూపాక మాజీ ఎంపీటీసి కేతిరి రాజిరెడ్డి, సమ్మక్క-సారలమ్మ దేవస్థానం మాజీ ఛైర్మన్ దాసరి సదయ్య గౌడ్, చెల్పూర్ మాజీ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు తాళ్లపల్లి కుమార్, ఇల్లందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.