కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి - ప్రభాకర్ దంపతులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం రోజున వారి కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి, సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ మహానగరం, దాని పరిధిలోని ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేయాలని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ అభివృద్ధి పనులు వేగవంతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ అధ్యక్షులు కర్ర హరీష్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ జన్ను షిభారాణి అనిల్, మాజీ పిఎసిఎస్ చైర్మెన్ బుద్దే పెద్దన్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.