హనుమకొండ (రైట్స్ మీడియా): ప్రజావాణి కార్యక్రమం ద్వారా నమోదవుతున్న వినతుల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన అర్జీలను పరిష్కరించే చర్యలు చేపట్టాలని ఆర్డీవోలు, తహసిల్దార్లను కలెక్టర్ వర్చువల్ విధానం ద్వారా ఆదేశించారు. ప్రజావాణి అర్జీలలో వివిధ శాఖల వారీగా ఉన్న పెండింగ్ లో ఉన్నవాటిపై సమీక్ష చేసి త్వరగా పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి వినతుల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలి
⏩ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్.
⏩ కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అర్జీలు 254.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...
ప్రజావాణి కార్యక్రమంలో అందిన వినతుల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయొద్దని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న వినతుల పరిష్కారానికి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కార బాధ్యతలు ఒకరికి అప్పగించాలన్నారు. ఆయా అప్లికేషన్లపై చర్యలు తీసుకున్న నివేదిక సమర్పించి అధికారులు వాటిని పరిష్కరించాలన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా ఆర్డీవో కార్యాలయాల్లో ఆర్డీవోలు ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలను, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 254 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డిఆర్డిఓ మేన శ్రీను, ఇతర శాఖల జిల్లా అధికారులు, అధికారులు పాల్గొన్నారు.