Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌లో ఘనంగా 'స్వచ్ఛతా హీ సేవా – 2026'

ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు.

నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌లో ఘనంగా 'స్వచ్ఛతా హీ సేవా – 2026'
Share Short Clip Download PDF

పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపు.

నరసరావుపేట (రైట్స్ మీడియా): నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్‌లో 'స్వచ్ఛతా హీ సేవా – 2026' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు పాల్గొని స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయడం మరియు పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో 'స్వచ్ఛమైన నరసరావుపేట – ఆరోగ్యకరమైన నరసరావుపేట' లక్ష్యంగా స్వచ్ఛతా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
"స్వచ్ఛతే సేవ… పరిశుభ్రతే మన బాధ్యత!" అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ..

Source / reference: Journalist Sk. Gouse, Palnadu.