నరసరావుపేట (రైట్స్ మీడియా): నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్లో 'స్వచ్ఛతా హీ సేవా – 2026' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు పాల్గొని స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
నరసరావుపేట మల్లమ్మ సెంటర్లో ఘనంగా 'స్వచ్ఛతా హీ సేవా – 2026'
ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు.
పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపు.
News URL: https://rightsmedia.in/news/swachhata-hi-seva-2026-celebrated-grandly-at-mallamma-centre-narasaraopet
ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయడం మరియు పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో 'స్వచ్ఛమైన నరసరావుపేట – ఆరోగ్యకరమైన నరసరావుపేట' లక్ష్యంగా స్వచ్ఛతా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
"స్వచ్ఛతే సేవ… పరిశుభ్రతే మన బాధ్యత!" అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.