నరసరావుపేట(రైట్స్ మీడియా): యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, భవిష్యత్తు అవకాశాలపై అవగాహన కల్పించడంతో పాటు సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ‘యువత భవితకు భరోసా – Zen G’ కార్యక్రమాన్ని సోమవారం నరసరావుపేటలో నిర్వహించారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారి ఆధ్వర్యంలో రావిపాడు రోడ్డులోని వాగ్దేవి విద్యాసంస్థల వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా Zen G విద్యార్థినీ విద్యార్థులతో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు ముఖాముఖిగా ముచ్చటించారు. విద్యార్థుల ఆశయాలు, ఆలోచనలు, భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకుని వారితో ఆత్మీయంగా సంభాషించారు. విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవడం, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించడం వంటి అంశాలపై విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు.