సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఏసీబీ వలలో చిక్కినట్లు సమాచారం. బుధవారం జు ఉదయం ఏసీబీ అధికారులు సూర్యాపేట పట్టణంలోని మానస నగర్ లో ఉన్న సోమయ్య నివాసంలో మరియు హైదరాబాద్ హయత్ నగర్ సూర్య నగర్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఏ కేసు నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టిందనే అంశంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఏసీబీ వలలో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్