మంత్రి కొండా సురేఖ వివాదంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి తన వాదన వినిపించారు. కొండా సురేఖ ఇష్యూ లో అధిష్టానం వద్ద పూర్తి సమాచారం ఉంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు.
అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి . ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది అధిష్టానం ఇష్టం. రాహుల్ పై నమ్మకం ఉంది ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం . క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరగాలనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. రాజగోపాల్ రెడ్డి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి. ప్రతిపక్షంలో ఉండి బిఆర్ఎస్ పై కొట్లాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలని అన్నారు.
అధిష్టానం నిర్ణయమే ఫైనల్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి