నిజామాబాద్ (రైట్స్ మీడియా): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి తన వెంట తీసుకెళ్లినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు సీతారామనగర్ కాలనీకి చెందిన లయన్ రవిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మైనర్ బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై డి.సునీల్ తెలిపారు.