కామారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల సస్పెన్షన్‌కు గురై ఇంటి వద్దే ఉంటున్న సాయిలు మనోవేదనకు గురైనట్లు బంధుమిత్రులు తెలిపారు. ఈ క్రమంలో కామారెడ్డిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడు సాయిలుకు భార్యతో పాటు కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన సాయిలు మృతి చెందడంతో తమ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సాయిలు కుటుంబాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ సాయిలు ఆత్మహత్య: ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న కుటుంబ సభ్యులు