నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఎన్.ఎస్.ఓ డ్యూటీ ముగించుకొని వచ్చిన తర్వాత ఉదయం సమయంలో ఆయుధం క్లీన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు మిస్ఫైర్ కావడం వల్ల రిజర్వ్ ఇన్స్పెక్టర్ హెచ్. సతీష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, హుటాహుటిన సంఘటన స్థలాన్ని పర్యవేక్షించారు. ఏ విధంగా జరిగిందో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదవశాత్తు సర్వీస్ తుపాకి పేలి ఆర్ఐ మృతి