నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని సిర్పూర్ గ్రామ శివారులో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్లలో ఒక బోరును పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు, మరో రెండు బోర్లకు సంబంధించిన విద్యుత్ వైర్లను కట్ చేసి వినియోగానికి అనువుగా లేకుండా చేయడంతో పాటు బోర్లకు సంబంధించిన స్టార్టర్ బాక్సులను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు బొడ్డు గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోపాల్ పోలీస్ స్టేషన్ ఎస్ హైచ్ ఓ జడ్.సుస్మిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.