నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ లలోని అన్ని గణేష్ నిమజ్జనోత్సం శోభయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. వినాయక నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.. అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, సి.సి కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలలతోపర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ, ఫారెస్టు శాఖ, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శోభయాత్రలో నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని, అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని అలాగే ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలన్నారు. డి.జేలు పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. ఎటువంటి పుకార్ల ను నమ్మరాదనీ, మద్యం సేవించి, ఊరేగింపులో పాల్గొనడం తప్పు వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతయని చెప్పారు.

అత్యవసర సమయంలో 112 డయల్ మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 87126-59700 అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్ ని సంప్రదించగలన్నారు. ప్రజలందరూ ఈ గణేష్ శోభయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలియజేశారు..