మరిపెడ మండల కేంద్రంలోని భార్గవ్ ఫంక్షన్ హాల్‌లో ఆగస్టు 25, 2026న మధ్యాహ్నం 1:30 గంటలకు ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సోషల్ మీడియా విభాగం తెలిపింది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్‌ఐఆర్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించి, అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను ఎమ్మెల్యే అందించనున్నారు. సమావేశానికి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, బీఎల్‌ఏలు, గ్రామ పార్టీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. సంబంధిత ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నిర్ణీత సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోరింది.
మరిపెడలో 25న ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశం