ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకు సూది మందులో విషమిచ్చి హత్య చేసిన నర్సు సురేఖ ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుంది. దాంతో సంగారెడ్డి పోలీసులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు తల్లిదండ్రుల హత్యకేసులో జైలు శిక్షణ అనుభవించి ఈ మధ్యనే బైల్ పై వచ్చింది. బైల్ పై వచ్చినప్పటి నుంచి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది. సురేఖ మృతికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది