హైదరాబాద్(రైట్స్ మీడియా): జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ హైదరాబాద్ నగరానికి చెందిన ఈషా సింగ్ వెండి పతకం సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఐదుసార్లు షూట్ఆఫ్స్లో ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొని, స్వల్ప తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయినా ఆమె ప్రదర్శన అద్భుతమని ప్రశంసించారు. ఈషా సింగ్ పోరాట స్ఫూర్తి క్రీడాలోకానికి ఆదర్శమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై మరెన్నో గొప్ప విజయాలు అందుకొని దేశ ప్రతిష్ఠను, తెలంగాణ ఖ్యాతిని చాటాలని ఆకాంక్షించారు.