తెహల్కా మ్యాగజైన్‌ వ్యవస్థాపకుడు, మాజీ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సహోద్యోగినిపై అత్యాచారం కేసులో ఆయన రెండు వారాల్లో లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

తెహల్కా మ్యాగజైన్‌ వ్యవస్థాపకుడు, మాజీ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తరుణ్‌ తేజ్‌పాల్‌ పోలీసుల ఎదుట రెండు వారాల్లో లొంగిపోవాలని.. దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

గోవాలో 2013 నవంబరులో నిర్వహించిన థింక్‌ఫెస్ట్‌ కార్యక్రమం సందర్భంగా మహిళా సహోద్యోగిపై తరుణ్‌ తేజ్‌పాల్‌ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. 2021లో తేజ్‌పాల్‌ను గోవా సెషన్స్‌ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆ తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాల్‌ చేసింది. విచారణ అనంతరం హైకోర్టు తరుణ్‌ తేజ్‌పాల్‌ ను దోషిగా తేల్చి.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,21,000 జరిమానా విధించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. తేజ్‌పాల్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. లొంగిపోవడం నుంచి తనకు తక్షణ మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ సుప్రీం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.