భారత నౌకాదళ నిస్తార్-క్లాస్ రెండో డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ 'నిపుణ్' ఈనెల 31న ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో కమిషన్ కానుంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ నౌక, సముద్ర గర్భంలో లోతైన డైవింగ్ ఆపరేషన్లు, అండర్‌వాటర్ రెస్క్యూ సపోర్ట్ అందించడంలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచనుంది.
భారత నౌకాదళం తన లోతైన సముద్రపు డైవింగ్, అండర్‌వాటర్ సపోర్ట్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. నిస్తార్-క్లాస్ శ్రేణికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ 'నిపుణ్' ఈనెల 31న ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో లాంఛనంగా భారత నౌకాదళంలోకి ప్రవేశించనుంది
రక్షణ రంగ నౌకా నిర్మాణంలో స్వదేశీ పరిజ్ఞానంతో 'ఆత్మనిర్భరత' సాధించే దిశగా నిపుణ్ నౌక నిర్మాణం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ ప్రత్యేక నౌకలో అత్యాధునిక డీప్-సీ డైవింగ్ వ్యవస్థలు, సముద్ర గర్భంలో సహాయక చర్యలు చేపట్టే ఆధునిక పరికరాలను అమర్చారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలో ఆపరేషన్లు నిర్వహించే నౌకాదళ డైవర్లకు నిరంతర సాంకేతిక సహకారం అందించడంలో 'నిపుణ్' కీలక పాత్ర పోషించనుంది.