Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

విశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండి

విశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండి
Share Short Clip Download PDF

అహ్మదాబాద్(రైట్స్ మీడియా): టెక్స్‌టైల్, ప్యాకేజింగ్ ఫిల్మ్స్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్స్ రంగాల్లో పేరెన్నికగన్న చిరిపాల్ గ్రూప్‌ (Chiripal Group) మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజ్ మోహన్ చిరిపాల్, గ్రూప్ అనుబంధ సంస్థ గ్రూ సోలార్ (GREW Solar) సీఈఓ వినయ్ థదానితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం అహ్మదాబాద్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..

రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, రహదారులు, విధానపరమైన మద్దతును పరిగణనలోకి తీసుకుని
విశాఖపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని
చిరిపాల్ గ్రూప్‌ను కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరం అత్యుత్తమ కనెక్టివిటీతోపాటు పారిశ్రామిక పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని తెలిపారు.

చిరిపాల్ గ్రూప్‌ మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజ్ మోహన్ చిరిపాల్ మాట్లాడుతూ..

తమ సంస్థకు చెందిన నందన్ డెనిమ్, విశాల్ ఫ్యాబ్రిక్స్, నందన్ టెర్రీ వంటి వస్త్ర ఉత్పత్తులు, చిరిపాల్ పాలీ ఫిల్మ్స్‌కు చెందిన ప్యాకేజింగ్ ఫిల్మ్స్, GREW సంస్థకు చెందిన సోలార్ ఉత్పత్తులు, రసాయనాలు 52కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లలో తమకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని బ్రిజ్ మోహన్ చిరిపాల్ తెలిపారు.

చిరిపాల్ గ్రూప్‌ మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజ్ మోహన్ చిరిపాల్ మాట్లాడుతూ..