"సత్యానికి శక్తినివ్వడం - హక్కులను పరిరక్షించడం" ఏకైక అజెండాగా రైట్స్ మీడియా సొసైటీ (Regd. No. 269/2026, Govt. of Telangana) ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టింది. ఇకపై ప్రజాప్రయోజనాలతో కూడిన పరిశోధనాత్మక ప్రత్యేక కథనాలు (Investigative Reports), బాధ్యతాయుతమైన ప్రభుత్వ ప్రాతినిధ్యాలు (Official Representations) మరియు ప్రజల్లో చట్టపరమైన అవగాహన కల్పించే లీగల్ డెస్క్ (Legal Desk) విశ్లేషణలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ & పబ్లిషర్ తాళ్ళపల్లి తిరుపతి (తిరువార్) ప్రకటించారు.
ప్రజాక్షేత్రంలోకి 'రైట్స్ మీడియా'... నిర్భయ జర్నలిజం దిశగా పరిశోధనాత్మక అడుగులు!
⏩ 'సత్యానికి శక్తినివ్వడం - హక్కులను పరిరక్షించడం' మా ప్రధాన ధ్యేయం: తాళ్ళపల్లి తిరుపతి (తిరువార్), ఫౌండర్ ప్రెసిడెంట్ & పబ్లిషర్, రైట్స్ మీడియా సొసైటీ.
⏩నిర్భయ జర్నలిజం దిశగా పరిశోధనాత్మక అడుగులు: అడిక సదానందం(వెటరన్ జర్నలిస్ట్), జనరల్ సెక్రటరీ & ఎడిటర్, రైట్స్ మీడియా సొసైటీ.
చట్టబద్ధత – నైతిక నియమావళి (Code of Ethics):
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB, Govt. of India) IT Rules, 2021 (Rule 18) నిబంధనలకు సంపూర్ణంగా లోబడి నమోదు కాబడటంతో పాటు, MIB గుర్తింపు పొందిన స్వయం నియంత్రణ మండలి 'డిజిపబ్' (DIGIPUB Level 2 SRB) లో రైట్స్ మీడియా సొసైటీ అధికారిక సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఎటువంటి వ్యాపార ప్రకటనలను స్వీకరించని 100% లాభాపేక్ష లేని (Non-Profit) మీడియాగా, జర్నలిజం కోడ్ ఆఫ్ ఎథిక్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ మరియు పక్కా ఆధారాల (Fact-Verification) పరిధిలోనే మా ప్రచురణలు సాగుతాయి.
ఎడిటోరియల్ ప్రణాళిక & ప్రాధాన్యతలు:
⏩పరిశోధనాత్మక కథనాలు (Investigative Reports):
సమాజంలోని అక్రమాలు, ప్రజాధనం నిధుల దుర్వినియోగం మరియు పాలనాపరమైన జవాబుదారీతనంపై నిష్పక్షపాతంగా ఆధారాలతో కూడిన కథనాలు అందించడం.
⏩ప్రభుత్వ యంత్రాంగానికి ప్రాతినిధ్యం (Official Representations):
ప్రభుత్వ అధికారిక సమాచారం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ప్రామాణికంగా ప్రజలకు అందించడంతో పాటు సమస్యలను ప్రచురించడమే కాకుండా, వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు మరియు శాఖల దృష్టికి అధికారిక ప్రాతినిధ్యాన్ని తీసుకెళ్లడం.
⏩లీగల్ డెస్క్ (Legal Desk):
రాజ్యాంగబద్ధమైన పౌర హక్కులు, చట్టపరమైన అవగాహన మరియు న్యాయ విశ్లేషణలను అందించడం.
సత్యం వైపు ఒక అడుగు:
"సత్యానికీ, ప్రజా హక్కులకీ కట్టుబడి సాగే ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాము. మనసులో ఆశయాలను దాచుకుని వ్యవస్థలతో నటిస్తూ వెళ్లే విధానానికి స్వస్తి పలుకుతూ, చట్టపరమైన మరియు నైతిక పరిమితుల్లో నిరంతరం ప్రజా పక్షాన నిలబడటమే మా ధ్యేయం" అని తాళ్ళపల్లి తిరుపతి (తిరువార్) పేర్కొన్నారు. ఈ నైతిక జర్నలిజం ప్రయాణంలో పౌర సమాజం, న్యాయ నిపుణులు మరియు పాఠకులు ఒక అడుగు ముందుకు వేసి మాతో కలవాలని కోరుతున్నాము.
– తాళ్ళపల్లి తిరుపతి (తిరువార్),
ఫౌండర్ ప్రెసిడెంట్ & పబ్లిషర్, రైట్స్ మీడియా సొసైటీ.
అధికారిక వెబ్‌సైట్లు: rightsmedia.in | english.rightsmedia.in
(MIB Compliant Digital News Publisher | Member of DIGIPUB - Level 2 SRB)