నిజామాబాద్ (రైట్స్ మీడియా): జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటి ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. అమాయకులను గ్రామ బహిష్కరణలు కుల బహిష్కరణల పేరట వేధిస్తున్నారు. ఆర్మూర్ మండలం గ్రామానికి చెందిన గంగయ్యను ఎనిమిది సంవత్సరాలుగా కుల బహిష్కరణ చేసి, ఇబ్బందులు గురి చేస్తున్నారు. తాజాగా వారికి సహకరించిన వారికి జరిమానా విధించి, అతనిపైన దాడికి తెగబడ్డారు. రాజకీయ బలం ఆర్థిక బలం ఉన్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకి పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన న్యాయం జరగడం లేదని బాధితుడు వాపోయాడు.
గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామస్తులు ఎవరు తమకు మంచి చెడుకు రావడంలేదని గ్రామంలో తాము అంటరాని వారిగా మిగిలిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులతో మాకు న్యాయం చేయకపోతే తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ఆయన తెలియజేశారు.
గ్రామంలో తాము అంటరాని వారిగా మిగిలిపోయామని బాధితులు ఆవేదన..
⏩అధికారులు స్పందించి, తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యనే శరణ్యమని వెల్లడి...